5 నుంచి చిరాగ్‌ ఆశీర్వాద్‌ యాత్ర
close

ప్రధానాంశాలు

5 నుంచి చిరాగ్‌ ఆశీర్వాద్‌ యాత్ర

దిల్లీ: లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ)లోని రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అబ్బాయ్‌- బాబాయ్‌.. చిరాగ్‌ పాసవాన్‌- పశుపతి పారస్‌లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించిన చిరాగ్‌ తన చిన్నాన్న తీరును తప్పుపట్టారు. తన తండ్రి సంవత్సరీకం జరగకముందే కుటుంబ సభ్యులు తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ప్రజల మద్దతు కోరుతూ బిహార్‌లో యాత్ర చేపడుతానని చెప్పారు. తన తండ్రి రాంవిలాస్‌ పాసవాన్‌ కర్మభూమి అయిన హాజీపుర్‌ నుంచి ఆయన జయంతి రోజైన జులై 5 నుంచి ‘ఆశీర్వాద్‌ యాత్ర’ జరుపుతానని ప్రకటించారు. తన తండ్రికి భారతరత్న ఇవ్వాలని ప్రధానిని కోరారు. చిరాగ్‌ నిర్వహించిన సమావేశాన్ని పారస్‌ ఖండించారు. నిజమైన నాయకులు ఎవరూ చిరాగ్‌ వెంట లేరని, అందరూ అద్దె మనుషులే వచ్చారని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని