రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: షబ్బీర్‌అలీ
close

ప్రధానాంశాలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: షబ్బీర్‌అలీ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో కొవిడ్‌ పరిస్థితులు, ఉద్యోగుల వేతన సవరణతో సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రాయితీలు ఇతర అత్యవసర ఖర్చులకు రుణాలు తీసుకునే దుస్థితి ఏర్పడిందని, ఈ కారణంగానే ప్రభుత్వ భూములను అమ్మేయాలని సర్కారు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులకు టీకాలు వేశాకే విద్యా సంస్థలు ప్రారంభించాలి: ఎన్‌ఎస్‌యూఐ

విద్యాసంస్థలను జులై 1వ తేదీ నుంచి ప్రారంభించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నేతలు హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం వెంకట్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా మూడో దశ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. విద్యార్థులందరికీ టీకాలు వేసిన తర్వాతే విద్యాసంస్థలను ప్రారంభించాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని