24న పీసీసీ అధ్యక్షుల సమావేశం
close

ప్రధానాంశాలు

24న పీసీసీ అధ్యక్షుల సమావేశం

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఈ నెల 24వ తేదీన రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జిల సమావేశం జరగనుంది. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొవిడ్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై పడుతున్న భారం, ఆర్థిక పరిస్థితుల గురించి ఇందులో చర్చించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని