లాకప్‌ డెత్‌కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
close

ప్రధానాంశాలు

లాకప్‌ డెత్‌కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

గవర్నర్‌కు ఉత్తమ్‌, భట్టి లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: దళిత మహిళ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క గవర్నర్‌ను కోరారు. మృతురాలు మరియమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం, ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సోమవారం గవర్నర్‌ తమిళిసైకి సంయుక్త లేఖ రాశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోవిందపురంలో ఓ ఇంట్లో మరియమ్మ వంట మనిషిగా పనిచేస్తుండగా..అక్కడ జరిగిన దొంగతనం కేసులో మరియమ్మను, ఆమె కుమారుడిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు.దీంతో ఆమె చనిపోయిందన్నారు.

వారి అసమర్థతే కారణం: వీహెచ్‌

పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకానికి పార్టీ సీనియర్‌ నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అధిష్ఠానాన్ని కోరారు. ఈ విషయంలో అధిష్ఠానం తనను విస్మరించిందని  వాపోయారు. పార్టీ దిగజారడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అసమర్థతే కారణమని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని