మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు మరో పోరు
close

ప్రధానాంశాలు

మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు మరో పోరు

మంద కృష్ణ మాదిగ

శామీర్‌పేట, న్యూస్‌టుడే: మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు దిల్లీ కేంద్రంగా మరో పోరాటానికి సంసిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్లు సాధించేందుకు నాయకత్వం శ్రమిస్తుందన్నారు. వచ్చే నెల 7న ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరించాలని సూచించారు. మంగళవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా తూంకుంటలో జరిగిన ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంస్థల జాతీయ స్థాయి  నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. జాతీయ నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య, ఎమ్మార్పీఎస్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు విశ్వనాథ్‌, జాతీయ కళామండలి అధ్యక్షుడు ఎన్‌వై.అశోక్‌ మాదిగ, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు గోపాల్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని