డిసెంబరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు: తమ్మినేని
close

ప్రధానాంశాలు

డిసెంబరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: సీపీఎం రాష్ట్ర మహాసభలు వచ్చే డిసెంబరులో నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈలోగా గ్రామాలు, మండలాలు, జిల్లా కమిటీల మహాసభలు పూర్తి చేసుకోవాలని కోరింది. రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్ఠం చేసేందుకు కృషి చేయాలనీ, వచ్చే నెలలో(జులై) 5 వేల గ్రామాలపై నేతలు దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని పిలుపునిచ్చింది. మంగళవారం ఎంబీ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొన్నారు. సమావేశం వివరాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 24న ఆయిల్‌ కంపెనీల కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, 30న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘‘మోదీ నిరంకుశ విధానాలను తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌లు వ్యతిరేకించడం లేదు. కేంద్రంతో లాలూచీకి కుస్తీ పడుతున్నారు’ అని వీరభద్రం పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని