ఎన్నికల బాండ్లతో భాజపాకు రూ.276 కోట్లు

ప్రధానాంశాలు

ఎన్నికల బాండ్లతో భాజపాకు రూ.276 కోట్లు

కాంగ్రెస్‌ ఖాతాలో రూ.58 కోట్లు: ఏడీఆర్‌

దిల్లీ: ఎన్నికల బాండ్ల రూపంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వేర్వేరు పార్టీలకు లభించిన మొత్తాల్లో అత్యధికం భాజపా ఖాతాలో పడ్డాయి. ఆ ఏడాది కమలనాథులకు రూ.276.45 కోట్లు (మొత్తం విరాళాల్లో 76.19%) లభించగా కాంగ్రెస్‌కు రూ.58 కోట్లు (15.98%) వచ్చాయని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. ఏడు ఎలక్టొరల్‌ ట్రస్టుల ద్వారా పార్టీలకు లభించిన విరాళాల వివరాలను ఏడీఆర్‌ వెల్లడించింది. ఆప్‌, సమాజ్‌వాదీ, జేడీయూ, జేఎంఎం, ఎల్‌జేపీ, అకాలీదళ్‌, ఐఎన్‌ఎల్‌డీ, ఆర్‌ఎల్‌డీ వంటి 12 పార్టీలకు కలిపి రూ.25 కోట్లు వచ్చాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని