విపక్షాలన్నీ క్వారంటైన్‌లో.. భాజపా ఒక్కటే సేవలో
close

ప్రధానాంశాలు

విపక్షాలన్నీ క్వారంటైన్‌లో.. భాజపా ఒక్కటే సేవలో

-  జె.పి.నడ్డా

దిల్లీ: విపక్ష నేతలెవరూ ప్రజల్లో లేరని... ట్విటర్‌లు, మీడియాల్లోనే కనిపిస్తున్నారని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా విమర్శించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. ‘‘భాజపా తప్పిస్తే మిగిలిన పార్టీలన్నీ క్వారంటైన్‌, ఐసోలేషన్‌లోకి వెళ్లాయి. కొన్ని పార్టీలైతే ఐసీయూలో ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. బుధవారం భాజపా మార్గదర్శి శ్యామాప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలంతా టీకాలు వేయించుకొని.. ప్రజల్ని మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి దేశంలో... 257 కోట్ల డోసుల టీకాలు వేస్తామని ఆయన ప్రకటించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని