బానిసలుగా మారిన ఎమ్మెల్యేలు
close

ప్రధానాంశాలు

బానిసలుగా మారిన ఎమ్మెల్యేలు

మరి ఐఏఎస్‌ అధికారులకు ఏమైంది?
కార్యకర్తల సమావేశంలో భాజపా నేత ఈటల

కమలాపూర్‌, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేలు, నాయకులు పదవుల కోసం బానిసలుగా మారారని.. ఐఏఎస్‌ అధికారులకు ఏమైందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ఎక్కడైనా అధికారులు బానిసలుగా మారి బాధ్యత మరిచిపోయి వ్యవహరిస్తే మున్ముందు పరిస్థితి కటువుగా ఉంటుందన్నారు. రేపటి తర్వాత కథ ఇట్లుండదని.. తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం అమలవుతోందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ ఆధిపత్యాన్ని అంతం చేయలేకపోతే అరిష్టమని తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో నిర్వహించిన భాజపా మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలు, మున్సిపాలిటీలకు మిషన్‌ కాకతీయ బిల్లులు ఇప్పించా. రెండున్నరేళ్లుగా బిల్లులు రావడం లేదు. ఫలితంగా తెలంగాణలో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అని ఈటల పేర్కొన్నారు. సమావేశంలో హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, కమలాపూర్‌ ఎంపీపీ తడక రాణి తదితరులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని