లోక్‌సభా పక్ష నేతగా శశిథరూర్‌!

ప్రధానాంశాలు

లోక్‌సభా పక్ష నేతగా శశిథరూర్‌!

పరిశీలనలో మనీశ్‌ తివారీ పేరూ..
అధీర్‌ను మార్చే యోచనలో కాంగ్రెస్‌

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరీని మార్చాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఆయన స్థానంలో కేరళ ఎంపీ శశిథరూర్‌, పార్టీలోని సీనియర్‌నేత, పంజాబ్‌ ఎంపీ మనీశ్‌ తివారీల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న అధీర్‌ను తప్పించాలన్న నిర్ణయం సోనియా గాంధీ తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌, ఇతర పార్టీలతో కూటమి కట్టిన కాంగ్రెస్‌.. ఘోర పరాజయం పాలైంది. ఎన్నికలకు ముందు అధీర్‌.. తృణమూల్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో కలిసి పనిచేయడానికి సుముఖత చూపలేదు. మమత కాంగ్రెస్‌లో ఉన్న సమయం నుంచీ అధీర్‌.. ఆమెకు వ్యతిరేకమే. మమత సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించారు. దీంతో జాతీయస్థాయిలో మమతతో కలిసి భాజపాపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధీర్‌ను మార్చాలన్న నిర్ణయంపై అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని