ఇకపై రాహుల్‌తో నేరుగా మాట్లాడొచ్చు!

ప్రధానాంశాలు

ఇకపై రాహుల్‌తో నేరుగా మాట్లాడొచ్చు!

ట్విటర్‌ ద్వారా నెటిజన్లతో నేరుగా సంభాషించే యోచన

దిల్లీ: సామాజిక మాధ్యమం ట్విటర్‌ను చురుగ్గా, ప్రభావవంతంగా వినియోగించుకుంటున్న రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముందు వరుసలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ట్విటర్‌లో తరచుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఇకమీదట తన రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడానికే కాదు.. నెటిజన్లతో సంభాషిస్తూ వారికి మరింత చేరువకావడానికీ ట్విటర్‌తో పాటు ఇతర సామాచ్కీజిజిక మాధ్యమాలను వినియోగించుకునే యోచనతో రాహుల్‌ ఉన్నారట. ఈ విషయాన్ని ఆ పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం రాహుల్‌ చేసిన ట్వీట్‌ అందుకు తొలి అడుగుగా కనిపిస్తోంది. ‘‘మీరు ఇటీవలి కాలంలో ఏయే పుస్తకాలు చదువుతున్నారు?’’ అని ఆయన నెటిజన్లను ప్రశ్నించారు. త్వరలోనే ఆయన తాను చదువుతున్న పుస్తకాల గురించి ట్వీట్లు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ట్విటర్‌లో రాహుల్‌ ఇమేజ్‌ను సరికొత్తగా తీర్చిదిద్దే కీలక బాధ్యతను మహిళా కాంగ్రెస్‌ మాచ్కీజీజి సభ్యురాలు ప్రతిష్ఠా సింగ్‌ తీసుకున్నట్లు చెప్పాయి. ఇటీవల రాహుట్‌ ట్విటర్‌లో కొందరు పాత్రికేయులతో పాటు మరికొందరిని అన్‌ఫాలో చేయడం కూడా ఇందులో భాగమే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ట్విటర్‌ ఖాతాను 1.93 కోట్ల మంది అనుసరిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని