కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నేడు ‘చలో రాజ్‌భవన్‌’
close

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నేడు ‘చలో రాజ్‌భవన్‌’

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపులో భాగంగా నేడు (గురువారం) కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులు బుధవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం గీతారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్ల హ్యాకింగ్‌ అంశానికి నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ, అమిత్‌ షాలు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు నుంచి రాజ్‌భవన్‌ వరకు జరిగే ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని