హుజూరాబాద్‌లో గెలిచితీరతాం

ప్రధానాంశాలు

హుజూరాబాద్‌లో గెలిచితీరతాం

కేసీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం
ఎంపీ బండి సంజయ్‌

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే అవినీతిపరుడని, త్వరలో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర శనివారం ఇల్లందకుంట మండలంలో కొనసాగుతుండగా సంజయ్‌ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈటలకు ప్రతి కార్యకర్త అండగా ఉంటారన్నారు. ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రికి ఉపఎన్నిక రాగానే వారి మీద ప్రేమ పుట్టుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. దళితుల మీద ప్రేమ ఉంటే అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతికి ఎందుకు హాజరుకావడం లేదని, హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దళిత బంధు అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో ఉన్న పేద ప్రజలకు రూ.10 లక్షల చొప్పున ఇప్పించేంత వరకు కేసీఆర్‌ను నిద్ర పోనీయమన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని