ఎకరాకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలి

ప్రధానాంశాలు

ఎకరాకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలి

తక్షణం పంట నష్టం అంచనా వేయించండి
సీఎంకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించి..ఎకరాకు రూ.15వేల చొప్పున పరిహారం చెల్లించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పంటల బీమా యోజన కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. వాటిని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పథకానికి చెల్లుచీటీ¨ ఇచ్చారని విమర్శించారు. జాతీయ వ్యవసాయ బీమా సంస్థ రాష్ట్రంలో వర్ష బీమా-2021 పేరుతో అమలు చేస్తోన్న పథకంలో కేవలం ఏడు పంటలకు మాత్రమే పరిమితమైందన్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

రేషన్‌ పంపిణీలో సంస్కరణలు తేవాలి: కోమటిరెడ్డి
పౌర సరఫరాల (రేషన్‌) పంపిణీలో నూతన సంస్కరణలు తీసుకురావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల ద్వారా చేపట్టిన ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందన్నారు. దానిని నమూనాగా తీసుకుని తెలంగాణలోనూ అదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈమేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని