రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ప్రధానాంశాలు

రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

మునుగోడు, న్యూస్‌టుడే: మునుగోడులో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తామన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పోలీసులు బుధవారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు బొంగుళూరు వద్ద అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన తనను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని కోమటిరెడ్డి ఖండించారు. అక్కడే కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేసి తిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మునుగోడు కాంగ్రెస్‌ నాయకులు.. కార్డుల పంపిణీకి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో మరికొందరు నాయకులు కాంగ్రెస్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న తెరాస నాయకులు పోలీసుల ఎదుటే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. కాంగ్రెస్‌ నేతలను ఠాణాకు తీసుకెళ్లారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని