మాజీ మంత్రి ఈటలకు అస్వస్థత

ప్రధానాంశాలు

మాజీ మంత్రి ఈటలకు అస్వస్థత

తాత్కాలికంగా వాయిదాపడ్డ ప్రజాదీవెన పాదయాత్ర

వీణవంక, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఈటల రాజేందర్‌ శుక్రవారం పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన జులై 19న కమలాపూర్‌ మండలం నుంచి ‘ప్రజాదీవెన’ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. అక్కడ ప్రసంగించిన అనంతరం ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఉన్న ఆయన నడవలేకపోయారు. దీంతో ఆయనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు వద్దకు తీసుకెళ్లి వైద్యులకు సమాచారం అందించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈటలకు బీపీ, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, షుగర్‌ లెవల్స్‌ పెరిగినట్లు తెలిపారు. హన్మకొండ నుంచి ప్రత్యేక వైద్యుడు వచ్చి రాజేందర్‌ను పరీక్షించి హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతానని ఈటల హుజూరాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. కోలుకున్న అనంతరం వాయిదాపడ్డ గ్రామం నుంచి ఈటల తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని