తెలంగాణకు చంద్రబాబుతో వచ్చిన నష్టం ఏంటి?: తెదేపా

ప్రధానాంశాలు

తెలంగాణకు చంద్రబాబుతో వచ్చిన నష్టం ఏంటి?: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు తెలంగాణ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, అయినా కొందరు ఆయనను ఆంధ్రావ్యక్తి అంటూ విమర్శించడం తగదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. తెలంగాణకు చంద్రబాబు వల్ల జరిగిన నష్టం ఏంటో చెప్పాలని సవాలు విసిరారు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన తెలుగు యువత రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహ్మద్‌ కులీ కుతుబ్‌షా తరవాత హైదరాబాద్‌ను ఆధునిక ప్రపంచ అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్ది యువతకు ఉపాధి కల్పించే కేంద్రంగా తయారుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.  తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జయరాం మాట్లాడుతూ.. పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని