ప్రగతి భవన్‌ చుట్టూ కంచె వేయాల్సి వస్తుంది

ప్రధానాంశాలు

ప్రగతి భవన్‌ చుట్టూ కంచె వేయాల్సి వస్తుంది

పోడు సమస్యపై సమావేశంలో ప్రొ.కోదండరాం హెచ్చరిక

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: గిరిజనులు పోడు భూముల్లో సాగు చేసుకోకుండా కందకాలు తవ్వి కంచెలు వేస్తున్నారని.. వాటి ద్వారా రైతులతో పాటు పశువులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఈ విధ్వంసకాండ ఆగాలని, పోడు సమస్యపై కేసీఆర్‌ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. దీనికి పరిష్కారం చూపకుంటే ప్రగతి భవన్‌ చుట్టూ కంచె వేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ‘పోడు- గోడు పరిష్కారానికి డిమాండ్‌’ పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. దీనికి హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యపై హైదరాబాద్‌లో బహిరంగ చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, దీనికి సీఎం కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు. గిరిజనులు వ్యాపారం కోసం పోడు భూములను సాగు చేయడం లేదని, ఆకలి తీర్చుకునేందుకే చేస్తున్నారన్నారు. ఈ సమస్యపై త్వరలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలోనే బహిరంగ చర్చ నిర్వహిస్తామని సభాధ్యక్షుడు వేణు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, భాజపా నేత వివేక్‌ వెంకటస్వామి, ఎల్‌హెచ్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌, సీపీఐ ఎంఎల్‌ నేతలు పోటు రంగారావు, చిన్న చంద్రన్న, శంకర్‌, శ్రీరాం నాయక్‌ తదితరులు మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని