అంబేడ్కర్‌ విగ్రహానికి ఎప్పుడైనా పూలమాల వేశారా?

ప్రధానాంశాలు

అంబేడ్కర్‌ విగ్రహానికి ఎప్పుడైనా పూలమాల వేశారా?

సీఎం కేసీఆర్‌కు గీతారెడ్డి ప్రశ్న

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టాక ఎప్పుడైనా డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారా? అని మాజీ మంత్రి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో తెరాసకు ఓట్లు వేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేయబోమని దళితుల్ని కేసీఆర్‌ బెదిరిస్తున్నారని శనివారం విమర్శించారు.

జానారెడ్డికి సీఎం క్షమాపణ చెప్పాలి: సంపత్‌కుమార్‌
రాష్ట్రంలో 24 గంటలూ కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొంటానని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నట్లు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ అన్నారు. ‘‘24 గంటలు కరెంటు ఇస్తే సంతోషం అని మాత్రమే జానారెడ్డి అన్నారు. కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిస్తే.. తెరాస పార్టీకి ప్రచారం చేస్తానన్నారు’’ అని వెల్లడించారు. తప్పుడు ఆరోపణలపై జానారెడ్డికి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని