బానిస బతుకులు ఇంకా ఎందుకు: ప్రవీణ్‌కుమార్‌

ప్రధానాంశాలు

బానిస బతుకులు ఇంకా ఎందుకు: ప్రవీణ్‌కుమార్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి ఏడేళ్ల పాలనలో గుర్తుకురాని ‘దళిత బంధు’ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలోనే గుర్తుకొచ్చిందా అని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలకవర్గాల నిర్లక్ష్యంతోనే పాఠశాలలు, యూనివర్సిటీలు ఎదగడం లేదని... పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బహుజన రాజ్యాధికారం దిశగా ఉపాధ్యాయులు సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్నారు. ధనిక రాష్ట్రంలో ఇంకా బానిస బతుకులు ఎందుకు? రాష్ట్ర సాధనకు బలిదానం చేసుకున్న విద్యార్థుల త్యాగాలు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ తరగతుల కోసం రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వాలన్నారు. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌, కాన్షీరాం ఆశయాల సాధన ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని