కేసీఆర్‌ వాగ్దానాలపై నమ్మకం లేదు

ప్రధానాంశాలు

కేసీఆర్‌ వాగ్దానాలపై నమ్మకం లేదు

మంద కృష్ణ మాదిగ

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాగ్దానాలపై మాదిగలకు నమ్మకం లేదు.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ మోసపూరితమైనవే.. హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించక ముందే దళితబంధు పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి’’ అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆదివారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో, 3న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, 4న మెదక్‌, రంగారెడ్డి, 5న మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, 6న నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సభలు నిర్వహిస్తామని వివరించారు. 9న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడతామన్నారు. 10 నుంచి 15వ తేదీ వరకు మండలాలు, జిల్లా కేంద్రాల్లో దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే 16న అన్ని దళిత వాడల్లో పాదయాత్ర చేపట్టి సెప్టెంబరు 5న హుజూరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని