బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి

ప్రధానాంశాలు

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి

నడ్డాకు సంక్షేమ సంఘం నేతల వినతి

ఈనాడు, దిల్లీ: బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నడ్డాను భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కేశన శంకర్‌రావు, జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ప్రతినిధులు బుధవారం కలిశారు. కులాలవారీగా జన గణన చేపట్టాలని, బీసీల సాధికారికతకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీలకు చెందిన 27 మందిని కేంద్ర మంత్రులుగా నియమించినందుకు, అఖిల భారత వైద్య విద్య ప్రవేశాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రెండు రాష్ట్రాల నాయకులు కనకాల శ్యామ్‌ కుర్మా, కుమ్మర క్రాంతికుమార్‌, తాటికొండ విక్రంగౌడ్‌, కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని