అమరరాజా వెళ్లిపోవాలని కోరుకోవడం లేదు

ప్రధానాంశాలు

అమరరాజా వెళ్లిపోవాలని కోరుకోవడం లేదు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ చిత్తూరు జిల్లా నుంచి వెళ్లిపోవాలని తాను కోరుకోవడం లేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు లోబడి పరిశ్రమ పని చేయాలని సూచించారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రసాయన పరిశ్రమైనా నిర్దిష్ట కాలపరిమితి తరువాత వేరేచోటకు తరలించాలని నిబంధనలు ఉంటాయన్నారు. చిత్తూరు సమీపంలో పరిశ్రమకు భూములున్నాయని, అక్కడికి తరలించవచ్చని సూచించారు. అమరరాజా అదనపు ప్రయోజనం కోసమే పక్క రాష్ట్రానికి వెళ్లాలనుకుంటోందని వ్యాఖ్యానించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని