ప్రజల పక్షాన పోరాడితేనే ఆదరణ: షర్మిల

ప్రధానాంశాలు

ప్రజల పక్షాన పోరాడితేనే ఆదరణ: షర్మిల

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ప్రజల పక్షాన పోరాడితేనే వారి నుంచి ఆదరణ లభిస్తుందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోటస్‌ పాండ్‌లో గురువారం ఆమె ‘రాజన్న యాదిలో వైఎస్‌ఆర్‌ జెండా పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. పార్టీ నేతలు తమ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లోని సమస్యలను సొంత సమస్యలుగా భావించి ప్రజల తరఫున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైతెపా అధికార ప్రతినిధులు ఏపూరి సోమన్న, పిట్టా రాంరెడ్డి, ఇందిరా శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని