బండి గారూ.. ఎలా ఉన్నారు?

ప్రధానాంశాలు

బండి గారూ.. ఎలా ఉన్నారు?

సంజయ్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు

ఈనాడు, దిల్లీ: ‘‘క్యా బండి జీ.. క్యా హాలే? (ఏం బండి గారు.. ఎలా ఉన్నారు?) అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను ఆత్మీయంగా పలుకరించారు. ఓబీసీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులతో గురువారం దిల్లీలో సంజయ్‌ ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సంజయ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని సూచించగా.. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలుచేస్తామని సంజయ్‌ అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని