పేదలను కాంగ్రెస్‌ వంచించింది

ప్రధానాంశాలు

పేదలను కాంగ్రెస్‌ వంచించింది

గత ప్రభుత్వాలు వ్యవస్థలను నాశనం చేశాయి
ప్రధానమంత్రి మోదీ విమర్శలు

భోపాల్‌: పేద వర్గాలను గత ప్రభుత్వాలు నయవంచనకు గురిచేశాయని పేర్కొంటూ కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శనాస్త్రాలను సంధించారు. ‘పేద’ అనే పదాన్ని ఆ ప్రభుత్వాలు ఓ వందసార్లు పాటలా పాడాయని, వారి సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థల పనితీరును మార్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతున్నాయని అన్నారు. శనివారం మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ లబ్ధిదారుల సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. గత ప్రభుత్వాలు పేదల విషయంలో అనుసరించిన తీరును తప్పుపట్టారు. రోడ్లు, విద్యుత్‌ లాంటి మౌలిక సదుపాయాలకు కూడా వారిని దూరం చేశాయని నిందించారు. ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను గాడిలో పెట్టామని, ఇప్పుడు దళారుల ప్రమేయం లేకుండా పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రభుత్వం పేదలకే తొలి ప్రాధాన్యత ఇచ్చిందని, 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్‌ అందించామని మోదీ పేర్కొన్నారు. ‘మేడిన్‌ ఇండియా’ వ్యాక్సిన్లకు తాము ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని