నిరుద్యోగులకు అండగా ఉంటాం

ప్రధానాంశాలు

నిరుద్యోగులకు అండగా ఉంటాం

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఎన్జీవోస్‌కాలనీ (హనుమకొండ), న్యూస్‌టుడే: తెరాస పాలనలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. వారికి అండగా ఉంటామన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. మంగళవారం హనుమకొండలోని హయగ్రీవచారి మైదానం ఎదుట ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు దీక్ష ముగించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలేనన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వర్సిటీల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలన్నారు. ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలన్నారు. తొలుత హనుమకొండ కేయూ కూడలిలో ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రగా దీక్షాస్థలికి చేరుకున్నారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ దివ్యాంగుడు నినాదాలు చేయడంతో ధైర్యముంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలని ఆమె సవాలు విసిరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని