పోరాడేవారికే ప్రజల అండ ఉంటుంది

ప్రధానాంశాలు

పోరాడేవారికే ప్రజల అండ ఉంటుంది

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే పోరాడేవారికి, దుర్మార్గాలను ఎదిరించిన వాళ్లకే ఈ ప్రాంత ప్రజలు అండగా ఉంటారనే విషయం తెలుస్తుందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మంగళవారం భాజపా మండల ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను భయపెట్టి, అణచివేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. కేసీఆర్‌ అహంకారానికి కారణమైన పదవి నుంచి ఆయన్ని దింపడమే నిజమైన ప్రతీకారమని అన్నారు. తెలంగాణ స్వాతంత్య్ర దినమైన సెప్టెంబరు 17ను అధికారికంగా జరుపుకోని ఏకైక ప్రాంతం మనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. నైజాం నుంచి విముక్తి పొందిన ప్రాంతాల్లో ఆ రోజున స్వాతంత్య్ర వేడుకలు చేసుకుంటుండగా తెలంగాణలో నిర్వహించుకోలేకపోవడం అవమానకరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరికి భయపడి వేడుకలను జరపడం లేదో ప్రజలకు చెప్పాలని రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, నాయకులు సంపత్‌రావు, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని