రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: మధుయాస్కీ

ప్రధానాంశాలు

రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: మధుయాస్కీ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అత్యధిక రైతులు వరి పంట పైనే ఆధారపడ్డారని.. వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ ఆరోపించారు. రైతు ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌ విధానాలే కారణమన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి.. ఇప్పుడు వరి వద్దంటే ఎలాగని ప్రశ్నించారు. ‘‘గతంలో సన్నాలు వేయమని చెప్పి రైతులను మోసం చేశారు. ఇప్పుడు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం’’ అని ప్రశ్నించారు. ప్రధానితో కలిసి కేసీఆర్‌ డ్రామా ఆడుతున్నారని మధుయాస్కీ ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని