సమాజం తలదించుకునే ఘటనిది: పవన్‌ కల్యాణ్‌

ప్రధానాంశాలు

సమాజం తలదించుకునే ఘటనిది: పవన్‌ కల్యాణ్‌

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య సమాజం తలదించుకోవాల్సిన ఘటనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన తీవ్రంగా కలచి వేసిందని.. నిందితుడికి కఠిన శిక్ష పడటంతోపాటు బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన తోడుంటుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ పెద్దలు వచ్చి ఆదుకుంటామని ఆ కుటుంబానికి భరోసా కల్పించాలన్నారు. మీడియా కొన్ని ఘటనలపై ఎక్కువగా ప్రచారం చేసి, ఈ తరహా వాటిపై సరైన రీతిలో స్పందించకపోవడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని కోమటిరెడ్డి అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని