అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి

ప్రధానాంశాలు

అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో బుధవారం నిర్వహించిన ‘దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుచేయాలంటూ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి లింగోజీ ఆధ్వర్యంలో రహదారుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఆపై ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరు యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ నినదించారు. ఒక దశలో కొందరు క్యాంపు కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని