నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్‌

ప్రధానాంశాలు

నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్‌

ఆత్మగౌరవ దండోరా సభ

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరగనుంది. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో రాష్ట్రస్థాయి మొదటి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గజ్వేల్‌లో శుక్రవారం  చివరి సభ నిర్వహిస్తున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లికార్జునఖర్గే, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని