సీఎం కుర్చీ కోసం కుట్రలు

ప్రధానాంశాలు

సీఎం కుర్చీ కోసం కుట్రలు

వారు చేస్తారేమో.. నేను కాదు: ఈటల

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుర్చీకి ఎసరు పెట్టే పని అల్లుడిగా హరీశ్‌రావు, కుమారుడిగా కేటీఆర్‌, బిడ్డగా కవిత చేస్తారేమో కానీ తనలాంటి వారు కాదని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో గురువారం పలువురు భాజపాలో చేరగా వారికి ఈటల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘నేను ప్రజల పక్షాన మాట్లాడతాను కానీ.. కుట్రలు చేసే వ్యక్తిని కాదు. నన్ను ప్రభుత్వం నుంచి బయటకు పంపినప్పుడు భూఆక్రమణలు చేశానన్నారు. ఇప్పుడు సీఎం కుర్చీ కోసం కుట్ర చేశానంటున్నారు. ఏది నిజమో మంత్రి హరీశ్‌రావు ప్రజలకు చెప్పాలి. గజ్వేల్‌లో హరీశ్‌రావు దత్తత గ్రామం నుంచి కొంతమంది వచ్చి నన్ను కలిశారు. మూడేళ్ల కిందట ఇళ్లు కట్టిస్తామని వారి నివాసాల్ని కూల్చి.. నేటి వరకు నిర్మాణమే చేపట్టలేదని వాపోయారు’’ అని ఈటల ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని