శశిథరూర్‌కు రేవంత్‌ క్షమాపణ

ప్రధానాంశాలు

శశిథరూర్‌కు రేవంత్‌ క్షమాపణ

 

ఆయనపై చేసిన వ్యాఖ్యల ఉపసంహరణ

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పై ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పార్లమెంటరీ ఐటీ స్థాయీసంఘం ఛైర్మన్‌ హోదాలో ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చి థరూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దానిపై రేవంత్‌ థరూర్‌ను విమర్శించారు. వీటిపై పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో థరూర్‌కు రేవంత్‌ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు గురువారం ట్విటర్‌లో ప్రకటించారు. థరూర్‌ స్పందిస్తూ... ఈ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు. ‘మనం అంతా కలిసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం’ అని అన్నారు.

రేవంత్‌ చిల్లర వ్యాఖ్యలు దారుణం: మంత్రి కేటీఆర్‌

సహచర ఎంపీ అయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి థరూర్‌పై అవమానకరంగా చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణమని మంత్రి కేటీఆర్‌ గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. నేర చరిత్ర, స్వభావం ఉన్న వారు పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. థరూర్‌పై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ట్విటర్‌లో ఉంచారు. దీన్ని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్‌ గొంతుతో కచ్చితంగా సరిపోతుందన్నారు.

రేవంత్‌ మానసిక వైద్యుడి వద్దకు వెళ్లాలి: బాల్కసుమన్‌

థరూర్‌పై చేసిన వ్యాఖ్యల ద్వారా రేవంత్‌రెడ్డి అబద్ధాలు, సంఘ వ్యతిరేక వ్యక్తిత్వం, క్రమశిక్షణ రాహిత్యమనే జబ్బుతో బాధ పడుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ అన్నారు. వెంటనే ఆయన చికిత్స కోసం మానసిక వైద్యనిపుణుడి వద్దకు వెళ్లాలని ట్విటర్‌ ద్వారా సూచించారు. వైద్య ఖర్చులను తామే భరిస్తామన్నారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని