కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం బందీ: వైఎస్‌ షర్మిల

ప్రధానాంశాలు

కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం బందీ: వైఎస్‌ షర్మిల

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: తాలిబన్ల చేతిలో అఫ్గానిస్థాన్‌ బందీ అయినట్లు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ చేతిలో బందీ అయిందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై ప్రభుత్వం పోలీసులతో దాడులు, హౌస్‌ అరెస్ట్‌లు చేయిస్తోందని, తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాచారం సంఘటనలో ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం చిన్నారికి దేవుడు చేశాడన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక 300 శాతం అత్యాచారాలు పెరిగాయని, ఇందుకు ప్రధాన కారణం మద్యమేనన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌, మద్యం అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారిపై హత్యాచారం జరిగి ఏడు రోజులు గడిచినా ఏ ఒక్క ప్రభుత్వ పెద్ద పరామర్శించలేదని, తన దీక్షతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఆమె అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని