పల్లా ప్రమాణ స్వీకారం

ప్రధానాంశాలు

పల్లా ప్రమాణ స్వీకారం

ఈనాడు, హైదరాబాద్‌: శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి తన కార్యాలయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గం నుంచి ఆయన రెండోసారి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన విషయం విదితమే. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, భగత్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వాణీదేవి, శేరి సుభాష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, పురాణం సతీశ్‌, తేరా చిన్నపరెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, గంగాధర్‌గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని