అమిత్‌ షా.. పటేల్‌ ఏమన్నారో తెలుసుకో!

ప్రధానాంశాలు

అమిత్‌ షా.. పటేల్‌ ఏమన్నారో తెలుసుకో!

సంస్థానాల విలీనానికి కమ్యూనిస్టుల పోరాటాలే కారణం
  సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: కేవలం కమ్యూనిస్టుల మిలిటెంట్‌ పోరాటాల ఫలితంగానే నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల వల్లే.. సంస్థానాల పాలకులకు భారత్‌లో కలవడం మినహా మరొక మార్గం లేకుండా పోయిందని స్వయంగా నాటి హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ చెప్పారని గుర్తుచేశారు. అమిత్‌ షా ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. సెప్టెంబర్‌ 17న అధికారికంగా ఉత్సవాలు నిర్వహించేలా సీఎం కేసీఆర్‌పై మేధావులు, ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో సభ జరిగింది. ట్రస్టు అధ్యక్షుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా డి.రాజా, వక్తలుగా తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కార్యవర్గ సభ్యుడు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. రాజా మాట్లాడుతూ.. మోదీ దేశాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న పలువురు సమరయోధుల్ని సన్మానించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని