విలీనాన్ని విమోచన అంటున్నారు

ప్రధానాంశాలు

విలీనాన్ని విమోచన అంటున్నారు

కొన్ని పార్టీలది తప్పుడు ప్రచారం: కె.కేశవరావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విలీన దినోత్సవానికి అర్థం తెలియని కొన్ని పార్టీల వారు విమోచన దినం అంటూ వక్రభాష్యాలు చెబుతున్నారని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. తెరాస ప్రధాన కార్యదర్శులు బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్‌, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌  పాల్గొన్నారు.  కేకే మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ చరిత్ర గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది విలీనదినమని తెలుసు. కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని