మోదీ సర్కారుని గద్దె దించాలి: బీవీ రాఘవులు

ప్రధానాంశాలు

మోదీ సర్కారుని గద్దె దించాలి: బీవీ రాఘవులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: అసమర్థ పాలన సాగిస్తోన్న మోదీ సర్కారును గద్దె దించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. కేంద్ర సర్కారు పేదల కోసం పని చేయడంలేదని, బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు పాటుపడుతోందని దుయ్యబట్టారు. శుక్రవారం సీపీఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్త రైతు ఉద్యమానికి మద్దతుగా వంద మీటర్ల రెడ్‌ ఫ్లాగ్‌తో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచి సుందరయ్య పార్కు వరకు ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథి రాఘవులు మాట్లాడుతూ.. సెప్టెంబరు 17ను భాజపా.. రెండు వర్గాల మధ్య గొడవగా వక్రీకరించి పబ్బం గడుపుకొంటోందని ఆరోపించారు. కార్యక్రమానికి పార్టీ సెంట్రల్‌ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, కమిటీ సభ్యులు దశరథ్‌, ఆశయ్య, మహేందర్‌, రమ, హిమబిందు, సాయిబాబా, స్కైలాబ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని