మేమొచ్చాక ‘తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం’గా జరుపుతాం: రేవంత్‌

ప్రధానాంశాలు

మేమొచ్చాక ‘తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం’గా జరుపుతాం: రేవంత్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబరు 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించిన అనంతరం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ‘ఇప్పుడు కొంత మంది వెయ్యి ఉరుల ఊడలమర్రికి వస్తున్నారు. ఆ ఘటన ఎప్పుడు జరిగిందో కూడా వాళ్లకు తెలియదు’ అని భాజపా నేతలనుద్దేశించి విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని