అక్టోబరు 2న సిరిసిల్లలో కాంగ్రెస్‌

ప్రధానాంశాలు

అక్టోబరు 2న సిరిసిల్లలో కాంగ్రెస్‌

‘నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ బహిరంగ సభ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: నిరుద్యోగ సమస్యపై అక్టోబరు 2న సిరిసిల్లలో ‘నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ పేరిట బహిరంగ సభ నిర్వహించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. దళిత, గిరిజన, ఆదివాసీల సమస్యలపై ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలు నిర్వహించిన పీసీసీ.. తదుపరి కార్యాచరణ నిరుద్యోగ సమస్యపై చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబరు 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేపట్టాలని నిర్ణయించింది. మొదటి సభ మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం సిరిసిల్ల నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

పీఏసీ కన్వీనర్‌గా 25న షబ్బీర్‌అలీ బాధ్యతల స్వీకరణ

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) కన్వీనర్‌గా నియమితులైన షబ్బీర్‌అలీ ఈ నెల 25న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని