504 జడ్పీటీసీలు.. 5,997 ఎంపీటీసీలు వైకాపా కైవసం

ప్రధానాంశాలు

504 జడ్పీటీసీలు.. 5,997 ఎంపీటీసీలు వైకాపా కైవసం

తెదేపాకు 6 జడ్పీటీసీ, 827 ఎంపీటీసీ స్థానాలు

ఈనాడు, అమరావతి: ఎన్నికలు నిర్వహించిన 515 జడ్పీటీసీల్లో 504 (97.86%), 7,219 ఎంపీటీసీల్లో 5,997 (83.07) స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. ఆరు జడ్పీటీసీ, 827 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. కడియం (తూ.గో.జిల్లా), వీరవాసరం (ప.గో.జిల్లా) జడ్పీటీసీ స్థానాలను జనసేన దక్కించుకుంది. 177 ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. విశాఖ జిల్లా అనంతగిరి జడ్పీటీసీ స్థానాన్ని సీపీఎం చేజిక్కించుకుంది. అనంతపురం జిల్లా రోళ్లలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థి గెలుపొందారు. కడప జిల్లా జమ్మలమడుగు జడ్పీటీసీ స్థానం పరిధిలోని రెండు పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాలు నీటితో తడిసిపోవడంతో లెక్కింపునకు అంతరాయం ఏర్పడి, ఫలితాలు నిలిపివేశారు. ఎంపీటీసీ స్థానాల్లో భాజపా 28 చోట్ల, సీపీఎం 15, సీపీఐ 8, కాంగ్రెస్‌ 4, స్వతంత్రులు 136 చోట్ల, ఇతరులు మరో 19 స్థానాల్లో గెలిచారు. బీఎస్పీ ఒక ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించింది. బ్యాలెట్‌ పెట్టెల్లోకి నీళ్లు చేరడంతో ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు నిలిపివేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని