ప్రభుత్వాధికారులు ఉన్నది.. నేతల చెప్పులు మోయటానికే!

ప్రధానాంశాలు

ప్రభుత్వాధికారులు ఉన్నది.. నేతల చెప్పులు మోయటానికే!

భాజపా సీనియర్‌ నేత ఉమాభారతి అనుచిత వ్యాఖ్య

భోపాల్‌: ప్రభుత్వ అధికార వ్యవస్థ మిథ్య. అధికారులు ఉన్నది రాజకీయ నేతల చెప్పులు మోయడానికే అంటూ భాజపా సీనియర్‌ నేత ఉమాభారతి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. శనివారం కొందరు ఓబీసీ నాయకులు భోపాల్‌లోని ఉమా భారతి నివాసానికి వచ్చి కలిశారు. కులాల వారీగా జనగణన చేపట్టాలని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఉమా భారతి వారితో మాట్లాడుతూ...‘‘రాజకీయ నాయకుల్ని అధికారులు నియంత్రిస్తున్నారని మీరనుకుంటున్నారా? లేదు. నేతల్ని అధికారులు నియంత్రిస్తారనేది అర్థరహితం. అలా చేయలేరు కూడా. మేం వారికి జీతాలిస్తాం. బదిలీలు, పదోన్నతులు కల్పించడంతో పాటు అవసరమైతే హోదాలనూ తగ్గించగలం. అయినా వాళ్లేం చేయగలరు?’’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ శనివారం నుంచి విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఉమాభారతి వ్యాఖ్యలు అధికారులను అవమానించేలా ఉన్నాయని, వెంటనే వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో ఉమాభారతి సోమవారం విచారం వ్యక్తం చేశారు. ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్న మాటలని, అయినా సౌమ్యమైన భాషను ఉపయోగించాల్సిందని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని