మరో విముక్తి పోరాటానికి సమయం ఆసన్నమైంది: మధుయాస్కీ

ప్రధానాంశాలు

మరో విముక్తి పోరాటానికి సమయం ఆసన్నమైంది: మధుయాస్కీ

మహాధర్నా నేపథ్యంలో పలు సంఘాలతో సమావేశం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో మరో విముక్తి పోరాటానికి సమయం ఆసన్నమైందని..ప్రజలందరూ ఈ పోరాటంలో పాల్గొని నియంత పాలనకు చరమగీతం పాడాలని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ కోరారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవు..చివరికి ఉపాధి హామీ పథకాన్నీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం ఇందిరాపార్కు వద్ద భాజపా, తెరాస యేతర పక్షాలు, ప్రజాసంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహాధర్నా నేపథ్యంలో మంగళవారం గాంధీభవన్‌లో ప్రజాసంఘాలు, కుల సంఘాలు, జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. మధుయాస్కీతో పాటు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి, అద్దంకి దయాకర్‌, బెల్లయ్యనాయక్‌, అయోద్యరెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు పాశం యాదగిరి, విట్టల్‌, రవి చంద్ర, కోలా జనార్దన్‌, కాల్వ సుజాత, సలీంపాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని