పింఛన్లకు కేంద్రం ఇచ్చేది రూ.200 కోట్లే

ప్రధానాంశాలు

పింఛన్లకు కేంద్రం ఇచ్చేది రూ.200 కోట్లే

తప్పని నిరూపిస్తే రాజీనామా: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ముప్కాల్‌, న్యూస్‌టుడే: ఆసరా పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 8 వేల కోట్లు ఖర్చవుతోందని, ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.200 కోట్లేనని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. దీన్ని తప్పని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని.. నిజమైతే ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవులకు బండి సంజయ్‌ రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండల పర్యటనలో ఆయన మాట్లాడారు. అంతకుముందు భీమ్‌గల్‌లో మాట్లాడుతూ.. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చినట్లు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని