దిల్లీలోని అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దాడి

ప్రధానాంశాలు

దిల్లీలోని అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దాడి

ఈనాడు, దిల్లీ: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన దిల్లీ అశోకా రోడ్డులోని ఇంటిపై మంగళవారం హిందూసేన కార్యకర్తలు కొందరు దాడిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘ కార్యాలయం పక్కనే ఉన్న ఈ ఇంటికున్న నామఫలకాలను ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు పగులగొట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీల్లో హిందువులకు వ్యతిరేకంగా ఒవైసీ చేస్తున్న వ్యాఖ్యలను గర్హిస్తూ ఆయన ఇంటిముందు నిరసన తెలిపేందుకు హిందూసేన కార్యకర్తలు వెళ్లినప్పుడు అందులోని కొందరు ఈ దాడి చేశారు. ఈ విషయంపై మాట్లాడుతూ ఒవైసీకి గుణపాఠం చెప్పేందుకే తమ కార్యకర్తలు ఇలా నిరసన తెలిపారని హిందూసేన చీఫ్‌ విష్ణు గుప్త మీడియాతో పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారని కొత్త దిల్లీ డీసీపీ దీపక్‌ యాదవ్‌ ప్రకటించారు.
దిల్లీలోని తన ఇంటిపై ఇలా అల్లరిమూకలు దాడిచేయడం ఇది మూడోసారి అని అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు భయపడతామనుకుంటే అది వారి అవివేకమే అవుతుందన్నారు. ‘‘ దేశ రాజధానిలోని ఎంపీ ఇంటికే భద్రత లేదు. నా ఇంటిని లక్ష్యంగా చేసుకున్నవారిని ఎవరు ప్రోత్సహించారో చెప్పాలి. వారిని చూసి మేం మౌనంగా ఉంటామని అనుకుంటే వారికి మజ్లిస్‌ గురించి తెలియనట్లే లెక్క’’ అని ఒవైసీ  మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని