ఏపీలో జోరుగా డ్రగ్స్‌ అక్రమ రవాణా!

ప్రధానాంశాలు

ఏపీలో జోరుగా డ్రగ్స్‌ అక్రమ రవాణా!

అఫ్గాన్‌ నుంచి ఆంధ్రకు మత్తుమందులు
తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపణ

ఈనాడు, అమరావతి: ఏపీలో మత్తుమందుల అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, అఫ్గానిస్థాన్‌ నుంచి వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌ దిగుమతవుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్‌లో పట్టుబడిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోని టాల్కమ్‌ పౌడర్‌ కంపెనీ పేరుతో దిగుమతయిందని.. దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డ్రగ్స్‌ వ్యాపారానికి గేట్లు తెరిచి సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత్‌ కిశోర్‌ను తెచ్చిపెట్టి ప్రజల్ని మళ్లీ మోసం చేయొచ్చని జగన్‌ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో బుధవారం తెలుగు రైతు విభాగం నాయకులతో ఆయన మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని