రేపటిలోగా తెరాస గ్రామ, మండల కమిటీలు

ప్రధానాంశాలు

రేపటిలోగా తెరాస గ్రామ, మండల కమిటీలు

నెలాఖరులోగా జిల్లా స్థాయిలో..
కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లో గురువారం వరకు తెరాస గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి కావాలని, 24లోగా తెలంగాణ భవన్‌కు నియోజకవర్గాల వారీగా జాబితాలు అందజేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నెలాఖరు వరకు జిల్లా కమిటీలు పూర్తి కావాలని, హైదరాబాద్‌ జిల్లాలో బస్తీ, డివిజన్‌ కమిటీల ఎంపిక జరగాలన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 24 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నందున 23 లోపే పార్టీ స్థానిక కమిటీల ఎన్నికలు పూర్తికావాలన్నారు. హైదరాబాద్‌లో స్థానిక కమిటీల ప్రక్రియ ఆలస్యంగా మొదలైనందున నవంబరు మొదటి వారంలో జిల్లా కమిటీ ఉంటుందన్నారు. జిల్లా కమిటీలన్నీ పూర్తయ్యాక రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటవుతుందన్నారు.  పార్టీ సంస్థాగత ఎన్నికల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని తెలిపారు. పార్టీ ప్లీనరీ, ద్విదశాబ్ది సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ వివరాలను నెలాఖరులోగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారన్నారు. గురువారంలోగా జాబితాలను అందజేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని