అసెంబ్లీలో వ్యూహంపై భాజపా చర్చ

ప్రధానాంశాలు

అసెంబ్లీలో వ్యూహంపై భాజపా చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగ భృతి హామీ, ఎస్సీలకు 3ఎకరాల భూపంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుచేయడం వంటి అంశాలపై అసెంబ్లీలో పట్టుబట్టి, అధికారపక్షాన్ని నిలదీయాలని భాజపా శాసనసభాపక్షం నిర్ణయించింది. శుక్రవారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఎమ్మెల్యేలు చర్చించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పాదయాత్రలో ఉన్న సంజయ్‌తో గురువారం వారు సమావేశమయ్యారు. పోడు భూములు, ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యంపైనా ప్రశ్నించాలని నిర్ణయించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని