ఫ్రంట్‌లైన్‌ వారియర్లలా పనిచేయాలి: రేవంత్‌

ప్రధానాంశాలు

ఫ్రంట్‌లైన్‌ వారియర్లలా పనిచేయాలి: రేవంత్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: పార్టీలో కష్టపడిన వారికి ఫలితాలు ఉంటాయని, అవకాశం వచ్చినప్పుడు ప్రతిభ నిరూపించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాజకీయాలలో అధికార ప్రతినిధుల పాత్ర కీలకమని, ఫ్రంట్‌లైన్‌ వారియర్లలా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ పార్టీ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, సురేష్‌ షెట్కార్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌, మీడియా సమన్వయకర్త అయోధ్యరెడ్డి పాల్గొన్నారు.

నేడు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం
కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో జరగనుంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ప్రధానంగా దళిత బంధును అన్ని నియోజకవర్గాలో అమలు చేయాలని, ధరణి సమస్యలు, పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను తగ్గించాలనే డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని